దుబాయ్ విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రత్యేక స్వాగతం..!!

- June 08, 2025 , by Maagulf
దుబాయ్ విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రత్యేక స్వాగతం..!!

దుబాయ్‌: ఈద్ అల్ అధా సెలవు వారాంతంలో దుబాయ్‌లో దిగే ప్రయాణికులను ప్రత్యేక రీతిలో స్వాగతిస్తున్నారు. పండుగ స్ఫూర్తికి అనుగుణంగా, పొడిగించిన వారాంతంలో దుబాయ్ విమానాశ్రయాలు, హట్టా సరిహద్దు క్రాసింగ్ ద్వారా వచ్చే ప్రయాణికులను GDRFA 'దుబాయ్‌లో ఈద్' అనే పదాలను కలిగి ఉన్న ప్రత్యేక పాస్‌పోర్ట్ స్టాంప్‌తో స్వాగతిస్తోంది.

దుబాయ్ మీడియా ఆఫీస్ స్టాంప్ గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రయాణికుల పాస్‌పోర్ట్‌లపై దాని ఫోటోలను పంచుకుంది. ఈ స్టాంప్ దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆఫీస్ సృజనాత్మక విభాగం బ్రాండ్ దుబాయ్ రూపొందించిన ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉందని తెలిపింది.  ఫెస్టివ్ సమయంలో నగరాన్ని సందర్శించేవారు దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ (డిపిఆర్) వద్ద అద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శన కోసం ఎదురు చూడవచ్చు. నాలుగు థీమ్ పార్కులను కలిపే శక్తివంతమైన ప్రాంతమైన రివర్‌ల్యాండ్ దుబాయ్ నుండి ఫైర్ వర్క్స్ కనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రెండు ఈద్‌లలో ఈద్ అల్ అధా అత్యంత పవిత్రమైనది. ఈ రోజు ఆచారాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం, మేక, పశువులు, గొర్రెలు లేదా ఒంటె వంటి వాటివి బలి ఇస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com