ఈద్ సెలవుల్లో సిమైస్మా బీచ్ లో ఉచిత ప్రవేశం..!!
- June 08, 2025
దోహా, ఖతార్: సిమైస్మా బీచ్ (ఫ్యామిలీ బీచ్, ఉమెన్స్ బీచ్)ను ఉచితంగా ప్రారంభిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈద్ సెలవు ముగిసే వరకు కొనసాగుతుందని తెలిపింది. కుటుంబాలు, మహిళలు సెలవులను ఆస్వాదించడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఈద్ అల్ అధా సెలవుల్లో తీరప్రాంత అందాలను ఆస్వాదించాలని ఆహ్వానిస్తోంది.
ఈద్ సెలవు దినాలలో ఖతార్ బీచ్‌లు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటని, ఇవి సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన వినోద కార్యక్రమాలకు నిలయంగా ఉన్నాయని తెలిపారు. అల్ ఘరియా బీచ్, అల్ మమ్లహా బీచ్ (మహిళల కోసం ), అల్ ఫర్కియా బీచ్, సిమైస్మా బీచ్, అల్ మఫ్జర్ బీచ్, 974 బీచ్, అల్ వక్రా పబ్లిక్ బీచ్, అల్ వక్రా ఫ్యామిలీ బీచ్, అల్ ఖరైజ్ బీచ్, సీలైన్ బీచ్ లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది దేశ తీరాలను సందర్శిస్తారని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌ల సహజ సౌందర్యం, భద్రతను కాపాడటానికి ప్రజలు నిర్దేశిత ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అన్ని రకాల వ్యర్థాలను నియమిత కంటైనర్లలో సరిగ్గా పారవేయాని, లేదంటే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవులకు హాని కలిగిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!