ప్రయాణ బీమాకు నివాసితుల నుంచి డిమాండ్.. ఇప్పుడే ఎందుకంటే?

- June 08, 2025 , by Maagulf
ప్రయాణ బీమాకు నివాసితుల నుంచి డిమాండ్.. ఇప్పుడే ఎందుకంటే?

యూఏఈ: వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రయాణ అంతరాయాలు, సామాను సమస్యలు, భద్రత వంటి ప్రమాదాల గురించి పెరిగిన అవగాహన కారణంగా.. యూఏఈ నివాసితులు తమ స్వదేశాలకు వెళ్లేటప్పుడు కూడా ప్రయాణ బీమాను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోందని బీమా పరిశ్రమ కార్యనిర్వాహకులు తెలిపారు. వేసవిలో పాఠశాలలు మూసివేసినప్పుడు  అనేక కుటుంబాలు సెలవుల కోసం తమ స్వదేశాలకు వెళ్లినప్పుడు, అవుట్‌బౌండ్ ప్రయాణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని Insurancemarket.ae డిప్యూటీ సీఈఓ హితేష్ మోత్వానీ తెలిపారు. యూఏఈ నివాసితులు తమ స్వదేశాలకు వెళ్లేటప్పుడు కూడా ప్రయాణ బీమాను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతుందన్నారు. Policybazaar.ae జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. వేసవి, ఈద్ లేదా పాఠశాల సెలవులలో ఎక్కువ మంది యూఏఈ ప్రవాసులు ప్రయాణ బీమాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com