రియలా లేక ఫేకా? దొంగను పట్టుకోవడానికి సౌదీ పోలీస్ సినిమా స్టంట్..!!
- June 11, 2025
యూఏఈ: సౌదీ అరేబియా పోలీసులు 'దొంగను పట్టుకోవడానికి' పెద్ద సహసం చేశారు. అతడి కారును వెంబడిస్తూ.. అమాంతంగా కారుపై దూకే వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. చాలామంది దీనిని సినిమా స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక అకౌంట్లలో షేర్ అవుతున్న ఈ వీడియోలో.. రియాద్‌లో ఒక తెల్ల కారును ఒక పోలీసుల వాహనం వెంబడిస్తున్నట్లు ఉంది. కారు వేగంగా ముందుకు వెళుతుండగా, అందులో ఒక పోలీస్ అకస్మాత్తుగా ముందు నుండి కారుపై దూకి, దాని విండ్‌షీల్డ్‌ను పగలగొట్టడం కనిపిస్తుంది. వెనుక నుండి మరో పోలీసు కారు వెళ్లకుండా తన వాహనాన్ని అడ్డంగా పెడతాడు.
ఈ వీడియో చూడటానికి నిజంగా కనిపిస్తున్నా.. వాస్తవానికి ఇది రియల్ స్టంట్ కాదు. ఇందులో సౌదీ పోలీసుల సామర్థ్యం తెలిపేలా.. పారిపోతున్న దొంగను ఛేజింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన మాత్రమే. హజ్ యాత్రకు ముందు రియాద్‌లో నిర్వహించిన మాక్ డ్రిల్ నుండి ఈ వీడియో ను తీసుకున్నారు.
హజ్ 2025 కోసం విస్తృతమైన సన్నాహాలలో భాగంగా, సౌదీ అరేబియా మే 31న మక్కాలో పెద్ద ఎత్తున భద్రతా దళాల పరేడ్, సైనిక విన్యాసాలను నిర్వహించింది. సౌదీ పోలీసులు మక్కాలో జరిగిన భద్రతా ప్రదర్శనలో పాల్గొని, ఈ కారు స్టంట్ ను సమర్థవంతంగా ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!