జుట్టు పోషణకు ఉపయోగపడే విటమిన్లు
- July 14, 2015
దారపువ్వులో జుట్టు పోషణకు ఉపయోగపడే విటమిన్ ఎ, విటమిన్ సి, ఆల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి తగిన పోషకాలనందించి జుట్టు పొడవుగా పెరగడంలో సాయపడతాయి. అరకప్పు హెన్నా పొడికి, కప్పు నిమ్మ టీ, ఆరు చెంచాల మందార ఆకుల పొడీ వేసి కలపాలి. దీన్ని జుట్టుకు రాసి మూడు గంటల తర్వాత కడిగేస్తే ప్రొటీన్ లోపంతో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. మందార ఆకులు లేదా పూరేకలను కొబ్బరినూనెలో మరిగించి జుట్టుకు రాసినా మంచి ఫలితం ఉంటుంది.ఐదు మందారపూలూ, మూడు ఆకులను నాలుగు చెంచాల నూనెలో వేసి మరిగించాలి. తర్వాత వడబోసి జుట్టుకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు నల్లబడటమే కాక పొడవుగా పెరుగుతుంది.కొన్ని మందార ఆకుల్ని తీసుకుని మెత్తగా చేయాలి. దీనికి అరకప్పు పెరుగు చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని కుదుళ్లకూ, జుట్టుకీ పట్టించి కాసేపాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు నల్లబడటమే కాదు, చివర్లూ చిట్లకుండా ఉంటాయి.మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే గుప్పెడు మందార ఆకులూ, కాసిని మజ్జిగా వేసి మెత్తగా చేయాలి. దీనిని మాడుకు పట్టించి గంట తర్వాత తలస్నానం
చేస్తే చుండ్రు మాయమవుతుంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







