యూఏఈ నివాసితులకు అర్మేనియా బంపరాఫర్..!!

- June 12, 2025 , by Maagulf
యూఏఈ నివాసితులకు అర్మేనియా బంపరాఫర్..!!

యూఏఈ: GCC, యూరోపియన్ యూనియన్ (EU), స్కెంజెన్ ఏరియా లేదా యునైటెడ్ స్టేట్స్‌లోని దేశాలు జారీ చేసిన రెసిడెన్సీ పర్మిట్‌లను కలిగి ఉన్న ప్రయాణికులకు వీసా రహిత విధానాన్ని అర్మేనియన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో జరిగిన ఆర్మేనియన్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్మేనియా, GCC సభ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని , పర్యాటకాన్ని పెంచుతుందని , వ్యాపార అవకాశాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఈ దేశం యూఏఈ నుండి కేవలం మూడు గంటల విమాన ప్రయాణంలో ఉంది. ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, విజ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రత్యక్ష విమానాలను నడుపుతున్నాయి. ఆ దేశం 2017లో యూఏఈ పౌరులకు, 2019లో ఖతార్‌కు, 2022లో కువైట్‌కు వీసా రహిత ప్రయాణాన్ని ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com