దక్షిణాఫ్రికాలో సాంస్కృతిక పర్యటన.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- June 12, 2025
దోహా: నోమాస్ సెంటర్ నిర్వహించే 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల కోసం దక్షిణాఫ్రికాకు సాంస్కృతిక పర్యటన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాత్ర 2025 ఆగస్టు 1 నుండి 9 వరకు జరగనుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిజిస్ట్రేషన్ రుసుము QR6,000గా నిర్ణయించారు. ఇందులో విమాన ఛార్జీలు, వసతి, రవాణా, వర్క్‌షాప్ ఫీజులు ఉంటాయని తెలిపారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న నోమాస్ సెంటర్.. పిల్లలను ఖతారీ వారసత్వం, సాంప్రదాయ ఆచారాలకు సంబంధించిన కార్యకలాపాలలో.. సముద్ర సంబంధ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటనను చేపడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్