నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!

- June 14, 2025 , by Maagulf
నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!

యూఏఈః యూఏఈలో జూన్ 15  నుండి కార్మికులకు వేసవి మధ్యాహ్న విరామం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మొహ్రే) నిర్మాణ స్థలాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు కార్మికులు నేరుగా ఎండలో మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయడంపై నిషేధం విధించారు.వేసవిలో కార్మికుల ఆరోగ్యం, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించే లక్ష్యంతో మధ్యాహ్న విరామ నిబంధనను అమలు చేస్తున్నట్లు మోహ్రే మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి Dh5,000 జరిమానా విధించబడుతుందని, గరిష్టంగా Dh50,000 వరకు ఫైన్ ఉంటుందని తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలను 600590000 నంబర్‌లో మోహ్రే కాల్ సెంటర్‌కు తెలపాలని సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com