మండుతున్న ఎండలు.. అల్ ఐన్లో 50.1ºCకి ఉష్ణోగ్రతలు..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో ఉష్ణోగ్రతలుగరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆ దేశ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.అల్ ఐన్లో 50.1ºC అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు పేర్కొంది. జూన్ 9న స్వీహాన్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇది నమోదైందని తెలిపింది. గతంలో జూన్ 9న 50.8ºCగా నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య నివాసితులు తమ ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని NCMలోని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







