సౌదీ అరేబియాలో 2.2%కి తగ్గిన ద్రవ్యోల్బణం..!!
- June 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే మే 2025లో 2.2 శాతంగా స్థిరంగా ఉంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రచురించిన నెలవారీ గణాంకాల బులెటిన్ ను విడుదల చేసింది. వినియోగదారుల ధరల సూచిక లేదా ద్రవ్యోల్బణం మే నెలలో 0.1 శాతం తగ్గుదల నమోదు చేసింది. అది గత ఏప్రిల్ నెలలో 2.3 శాతంగా ఉంది. సౌదీ అరేబియా G20 దేశాలలో అత్యల్ప ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసింది. ద్రవ్యోల్బణంలో ఈ స్వల్ప తగ్గుదలకు ప్రధానంగా రవాణా సూచికలో 0.2 శాతం తగ్గుదల నమోదు.. వినోదం, సంస్కృతి సూచికలో 0.1 శాతం తగ్గుదల, గృహోపకరణాలు, పరికరాల సూచికలో 0.7 శాతం తగ్గుదల, దుస్తులు - పాదరక్షల సూచికలో 0.4 శాతం తగ్గుదల మరియు కమ్యూనికేషన్ సూచికలో 0.1 శాతం తగ్గుదల కారణమని తెలిపారు. మే నెలలో రెస్టారెంట్లు, హోటళ్ళు, విద్య, ఆరోగ్య సూచికల ధరలు పెద్దగా మారలేదని పేర్కొంది.
GASTAT నివేదిక ప్రకారం.. గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్, ఇంధన సూచికలో 0.3 శాతం పెరుగుదల నమోదైంది. దీనికి వాస్తవ గృహ అద్దె ధరలలో 0.4 శాతం పెరుగుదల కారణమైందన్నారు. ఆహార, పానీయాల సూచికలో 0.1 శాతం పెరుగుదల, వ్యక్తిగత సేవల సూచికలో 0.5 శాతం పెరుగుదల, పొగాకు సూచికలో 0.2 శాతం పెరుగుదల కూడా నమోదు చేసినట్లు నివేదికలో తెలిపారు. వార్షిక ప్రాతిపదికన.. గృహ, నీరు, విద్యుత్, గ్యాస్, ఇంధన సూచిక 6.8 శాతం పెరిగింది. మే 2025లో గృహ అద్దెలు 8.1 శాతం పెరిగాయి. దీని ప్రభావం విల్లా అద్దె ధరలలో 7.1 శాతం పెరిగింది. ఈ పెరుగుదల మే 2025లో వార్షిక ద్రవ్యోల్బణం కొనసాగిన వేగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని, దీని వాటా 25.5 శాతంగా ఉందన్నారు. అదే సమయంలో మాంసం, పౌల్ట్రీ ధరలలో 2.8 శాతం పెరుగుదల కారణంగా ఆహారం, పానీయాల ధరలు 1.6 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. ఉన్నత విద్య తర్వాత ఫీజులలో 5.6 శాతం పెరుగుదల కారణంగా విద్యా సూచిక 1.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
మరోవైపు, గృహోపకరణాలు, పరికరాల విభాగంలో ధరలు 2.5 శాతం తగ్గాయి. ఫర్నిచర్, కార్పెట్‌లు, ఫ్లోర్ కవరింగ్‌లలో 4 శాతం తగ్గుదల దీని ప్రభావానికి కారణమైంది. పాదరక్షల ధరలలో 2.7 శాతం తగ్గుదల కారణంగా దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరలు 0.9 శాతం తగ్గాయి. రవాణా విభాగం కూడా 0.8 శాతం తగ్గుదలని నమోదు చేసింది. వాహనాల కొనుగోలు ధరలలో 1.9 శాతం తగ్గుదల దీని ప్రభావానికి కారణమైందని నివేదిక తెలిపింది. వ్యవసాయ మరియు మత్స్య ఉత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 4.4 శాతం పెరిగాయని అథారిటీ పేర్కొంది. దీనికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 2.6 శాతం పెరగడం , చేపలు , ఇతర మత్స్య ఉత్పత్తులలో 6.1 శాతం పెరుగుదల కారణమైంది. నెలవారీ ప్రాతిపదికన, ఏప్రిల్ పోలిస్తే మే నెలలో టోకు ధరల సూచిక స్థిరంగా ఉందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం