ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం.. యూఏఈ నివాసితులపై అదనపు ఇంధన భారం..!!

- June 16, 2025 , by Maagulf
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం.. యూఏఈ నివాసితులపై అదనపు ఇంధన భారం..!!

యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువగా పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధ ప్రారంభమైన తర్వాత ముడి చమురు 14 శాతం వరకు పెరిగింది. వీకెండ్ లో బ్రెంట్ ధరలు వరుసగా 7.26 మరియు 7.02 శాతం పెరిగి బ్యారెల్‌కు $72.98 మరియు $74.23 వద్ద ముగిశాయి. చమురు ధరలు పెరుగుతూనే ఉంటే.. యూఏఈలో వాహనదారులు వచ్చే నెలలో మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.

జూన్‌లో యూఏఈ చమురు ధరలను మార్చకుండా కొనసాగించింది. సూపర్ 98, స్పెషల్ 95, మరియు E-ప్లస్ ధరలు వరుసగా లీటరుకు Dh2.58, Dh2.47 మరియు Dh2.39గా ఉన్నాయి.

అక్టోబర్ 2024లో ఇజ్రాయెల్ ఇరానియన్ అణు కేంద్రాలపై ఒక పెద్ద దాడిని ప్రారంభించింది. ఆ సమయంలో ఇరాన్ డ్రోన్ దాడులతో ప్రతిస్పందించింది. ఆ సమయంలో కూడా ఇంధన ధరలు అమాంతంగా పెరిగాయని స్విస్‌కోట్ బ్యాంక్ సీనియర్ విశ్లేషకుడు ఇపెక్ ఓజ్కార్డెస్కాయా అన్నారు.  ప్రస్తుత పరిస్థితులను బట్టి రాబోయే కొన్ని రోజుల్లో చమురు ధరలు బ్యారెల్‌కు $90-$100 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుందన్నారు.  ఇక ఇరాన్, ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే మాత్రం పరిస్థితులు ఘోరంగా తయారు అవుతాయని  జాయే క్యాపిటల్ విశ్లేషకుడు నయీమ్ అస్లాం అన్నారు.  ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతింటే ధరలు $120 దాటవచ్చని తెలిపారు.  

సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా చోక్‌పాయింట్ అయిన హార్ముజ్ జలసంధికి స్వల్ప అంతరాయం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, కొంతమంది విశ్లేషకులు చెత్త సందర్భంలో బ్యారెల్‌కు $100 వైపు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com