యూఏఈ: ఆన్లైన్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసితే జైలు శిక్ష, జరిమానా
- June 16, 2025
యూఏఈ: దేశ ప్రతిష్ఠను ఆన్లైన్లో అవమానించటం తగదని యూఏఈ అధికారులు హెచ్చరించారు. అబుధాబి న్యాయ విభాగం ఏప్రిల్ 29న ఎక్స్ (మునుపటి ట్విటర్) లో చేసిన ప్రకటన ప్రకారం, దేశం, ప్రభుత్వ సంస్థలు, అధికారులు అవమానించబడే విధంగా సమాచారాన్ని ప్రచురించిన వారికి ఐదు సంవత్సరాలతో జైలు శిక్షతో పాటు AED 500,000 వరకు జరిమానా విధించబడుతుందని పేర్కొనింది.
ఫెడరల్ చట్టం నెం (34) ఆఫ్ 2021 (అపవాదులు మరియు సైబర్ నేరాలతో పోరాటం) లోని ఆర్టికల్ (25) ప్రకారం ఇది వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న అబు ధాబి పోలీసు ప్రజలకు తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చెయ్యకూడదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, సమాజ విభజనకు కారణమయ్యే, నెగిటివ్ పోస్ట్లు చేసే వారికి Dh1 మిలియన్ వరకు జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడవచ్చని నిపుణులు తెలిపారు.
సోషల్ మీడియా వాడకంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, ఏ సమాచారం పంచుకునే ముందు దాని నిజనిజాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!