3 వేలమంది కార్మికులకు ఉచిత అగ్నిమాపక భద్రత, CPR శిక్షణ..!!
- June 19, 2025
యూఏఈ: ఈ వేసవిలో బ్లూ-కాలర్ కార్మికులకు సహాయం చేయడానికి అనేక సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నాయి. ఉచితంగా అగ్నిమాపక భద్రత, CPR శిక్షణను అందించనున్నారు. 1992 నుండి విద్యా సంస్థగా ఉన్న రేవాక్ ఔషా ఇన్స్టిట్యూట్ , కల్చరల్ సెంటర్.. మొత్తం 3,000 మంది బ్లూ-కాలర్ కార్మికులకు ఉచిత భద్రతా శిక్షణను అందించడానికి నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NEBOSH)తో కలిసి పనిచేయనుంది.
తీవ్రమైన వేసవి నెలల్లో బహిరంగ కార్మికులలో హీట్ స్ట్రోక్ గురయ్యే ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి అసోసియేషన్ ఆఫ్ కేరళ మెడికల్ అండ్ డెంటల్ గ్రాడ్యుయేట్స్ (AKMG) అనే వైద్యుల బృందం స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి నిర్వహించబడిన బీట్ ది హీట్ ప్రచారం చేపట్టనున్నారు.
ఈ నెల ప్రారంభంలో యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) కార్మికులను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి మూడు నెలల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బహిరంగ పనిపై నిషేధాన్ని అమలు చేస్తుంది.
ప్రథమ చికిత్స, CPR, అత్యవసర ప్రతిస్పందన విధానాలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నివారణ, రెస్క్యూ టెక్నిక్‌లతో సహా కీలకమైన కార్యాలయ భద్రతా అంశాల పట్ల కార్మికులకు అవగాహన కల్పించనున్నారు. వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచడానికి పలు భాషలలో నిర్వహించనున్నట్లు రేవాక్ ఔషా ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ అమీనా అజ్మల్ అన్నారు.
నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) దుబాయ్ మద్దతుతో జరుగుతున్న ఈ ప్రారంభ సెషన్ ఈ నెల ప్రారంభంలో జరిగింది. అల్ నబూదా కన్స్ట్రక్షన్ గ్రూప్ నుండి 100 మంది కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ సంవత్సరం చివరి వరకు అందించబడే శిక్షణ కోసం యూఏఈలోని ఇతర కంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బీట్ ది హీట్ ప్రచారంలోని ప్రతి సెషన్లో చర్చలు, సమాచార సామగ్రి పంపిణీ, వైద్యుల ప్యానెల్‌తో ఇంటరాక్టివ్ ఉంటాయి. ఇది ప్రతి ఆదివారం 15 వారాల పాటు వివిధ ప్రదేశాలలో జరుగుతుంది. మొదటి సెషన్ జూన్ 15 ఆదివారం DIPలోని లేబర్ క్యాంప్‌లో ప్రారంభమైంది. ఇది కార్మికులకు వారి వైద్య సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుందని దుబాయ్‌లోని ముఖ్య ప్రచార నిర్వాహకురాలు డాక్టర్ నీతా సలాం అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!