కువైట్ లో ఆహార భద్రత..మార్కెట్ లలో తనిఖీలు ముమ్మరం..!!

- June 19, 2025 , by Maagulf
కువైట్ లో ఆహార భద్రత..మార్కెట్ లలో తనిఖీలు ముమ్మరం..!!

కువైట్: దేశంలోని ఆహార భద్రతపై ఆందోళనల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్కెట్లలో తనిఖీలను మమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖలోని వాణిజ్య నియంత్రణ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్-అన్సారీ  షువైఖ్ ప్రాంతంలోని హోల్‌సేల్ మార్కెట్‌లో తనిఖీలు  నిర్వహించారు. ఆహార నిల్వ స్థాయిలను అంచనా వేశారు. మార్కెట్లో అవసరమైన వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఈ తనిఖీలను నిర్వహిస్తుంది. తన పర్యటనలో అల్-అన్సారీ.. బాటిల్ వాటర్, ఆహార పదార్థాలు, డబ్బాల వస్తువుల సరఫరాలను తనిఖీ చేశారు. మార్కెట్ కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని, కంపెనీ గిడ్డంగులలో సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక మార్కెట్లపై యుద్ధ భయాలు లేవని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.  అన్ని ముఖ్యమైన వస్తువుల లభ్యత సరైన స్థితిలోనే ఉంటుందన్నారు.  ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల విశ్వాసాన్ని పెంచేలా ఫుడ్ ఉత్పత్తి లభ్యతను కొనసాగించడానికి రాబోయే రోజుల్లో మార్కెట్‌కు అదనపు స్టాకును విడుదల చేయడానికి  సరఫరా కంపెనీలు తెలిపాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com