యోగా శిక్షకురాలు-స్వాతి ప్రసన్న.
- June 21, 2025
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది జీవితాల్లో యోగా ఓ భాగమైంది.దీనివల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చనని నిపుణులు చెబుతున్నారు.అయితే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకూ కొన్ని పరిమితులు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఏ ఆసనం ఎప్పుడు, ఎలా వేయాలి? ఎలా వేయకూడదో కచ్చితంగా తెలిసుండాలని సూచిస్తున్నారు.అలాంటి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు యోగా శిక్షకులు మాత్రమే. ఇలా యోగాలో శిక్షణ ఇస్తున్న ప్రముఖ యోగా శిక్షకురాలు స్వాతి ప్రసన్న మీద ప్రత్యేక కథనం...
ఈ రోజుల్లో మానసిక ఒత్తిడితో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శారీరక శ్రమ లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది.ఫలితంగా అధిక బరువు.దాంతో జీవక్రియలు నెమ్మదించడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాంటి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఏంతో ఉపయోగపడుతుంది.ఒత్తిడి, నిద్రలేమి, పనిభారంతో ఈ రోజుల్లో అనేక మంది నేడు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.వాటిని నిర్లక్ష్యం చేస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. దాంతో బైపోలార్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ యోగా గురు స్వాతి ప్రసన్న తెలియజేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన స్వాతి ప్రసన్న గత 8 ఏళ్లుగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు.హఠ యోగా, ధ్యాన యోగా, పతంజలి యోగా వంటి వాటిల్లో ఆమె శిక్షణ ఇస్తున్నారు.ఇప్పటి వరకు ఆమె పదుల సంఖ్యలో శిక్షణ ఇచ్చారు.ఆమె దగ్గర శిక్షణ తీసుకున్న వారు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఆరోగ్య సమస్యలను శస్త్ర చికిత్సలకు సరిసమానంగా యోగా ద్వారా దూరం చేసుకోవచ్చని స్వాతి చెబుతున్నారు.కరోనా ఆ సమయంలో కూడా యోగాను కొనసాగించటం వల్ల ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు అని తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా