విదేశీ వాణిజ్యం కోసం కొత్త మంత్రిత్వ శాఖ: షేక్ మొహమ్మద్

- June 21, 2025 , by Maagulf
విదేశీ వాణిజ్యం కోసం కొత్త మంత్రిత్వ శాఖ: షేక్ మొహమ్మద్

యూఏఈ: యూఏఈలో విదేశీ వాణిజ్యం కోసం ప్రభుత్వంలో కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు డాక్టర్ థాని అల్ జెయుది మంత్రిగా నియమితులయ్యారు. అలాగే, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను జనవరి 2026 నుండి క్యాబినెట్, మినిస్టీరియల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఫెడరల్ ఎంటిటీలు, ప్రభుత్వ కంపెనీల అన్ని బోర్డుల డైరెక్టర్లలో సలహా సభ్యునిగా ఉండనున్నారు. ఈ మేరకు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు.
"ఈ కౌన్సిల్లలో నిర్ణయం తీసుకోవడానికి మద్దతు ఇవ్వడం, వారి నిర్ణయాలను తక్షణ విశ్లేషణలు నిర్వహించడం, సాంకేతిక సలహాలను అందించడం, అన్ని రంగాలలో ఈ కౌన్సిల్లు స్వీకరించే ప్రభుత్వ విధానాల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యం" అని షేక్ మొహమ్మద్ తెలిపారు.   ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరును అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నేతృత్వంలోని ఆర్థిక, పర్యాటక మంత్రిత్వ శాఖగా మార్చినట్లు ఆయన తెలిపారు.
షార్జా ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (షురూక్) సీఈఓ అహ్మద్ ఒబైద్ అల్ కసీర్ మాట్లాడుతూ.. ఈ వ్యూహాత్మక మార్పులు యూఏఈ సమగ్ర అభివృద్ధి విధానాన్ని కలిగి ఉంటాయన్నారు.  ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రముఖ ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com