శాంతియుత పరిష్కారం కోసం..ఒమన్ దౌత్యపరమైన ప్రయత్నాలు..!!
- June 21, 2025
మస్కట్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి ఒమన్ తన దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ ఉద్రిక్తతను అంతర్జాతీయ, మానవతా,నైతిక చట్టాల స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంది.అణు విస్తరణను నిరోధించడానికి యుఎస్-ఇరాన్ ఒప్పందాన్ని సాధించడానికి ఈ దాడులు తీవ్రమైన అడ్డంకిగా మారాయని ఒమన్ తెలిపింది.సైనిక ఉద్రిక్తతను నివారించాలని, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిచ్చింది. సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని చూపేలా చొరవ తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
అదే విధంగా మిడిలీస్ట్ లో నిరంతర ఉద్రిక్తత పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధాలతో సహా సామూహిక విధ్వంసక ఆయుధాలను ఈ ప్రాంతం నుండి తొలగించాలని పిలుపునిచ్చింది. ఇదే అంశంపై ఇస్తాంబుల్‌లో జరుగున్న ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒమన్ పాల్గొని, తన వైఖరిని తేల్చి చెప్పనుంది. రాజకీయ వ్యవహారాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ నాయకత్వంలో ప్రత్యేక బృందం ఈ సమావేశాల్లో పాల్గొంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!