ఇరాన్ నుండి తన పౌరులను తరలిస్తున్న యూఏఈ..!!

- June 21, 2025 , by Maagulf
ఇరాన్ నుండి తన పౌరులను తరలిస్తున్న యూఏఈ..!!

యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తమ పౌరులను తరలిస్తుంది.   ఈ తరలింపు మిషన్ ఇరాన్లోని సంబంధిత అధికారుల సమన్వయంతో జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఈ వివాదాన్ని ముగించడానికి సంబంధిత పార్టీలతో నిరంతరం దౌత్య సంభాషణలు, సంప్రదింపులను జరుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.  
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో ఇరాన్, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనపై చర్చించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com