2028 నుండి ఒమన్ లో 5% ఆదాయపు పన్ను..!!

- June 23, 2025 , by Maagulf
2028 నుండి ఒమన్ లో 5% ఆదాయపు పన్ను..!!

ఒమన్: 2028 నుండి ఒమన్ వార్షిక ఆదాయం 42,000 ఒమన్ రియాల్స్ (సుమారుగా దిర్హామ్‌లు 400,000) కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులపై ఐదు శాతం ఆదాయపు పన్ను విధించనుంది. రాయల్ డిక్రీ నంబర్ 56/2025 జారీ చేసిన వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే లక్ష్యం ప్రభుత్వ ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, చమురు ఆదాయాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ ప్రాంతంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన మొదటి గల్ఫ్ సహకార మండలి (GCC) దేశంగా సుల్తానేట్ అవతరించనుంది.  యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు విలువ ఆధారిత పన్ను (VAT), కార్పొరేట్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాయి. దాంతోపాటు నివాసితులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యూఏఈ పొగాకు, కార్బోనేటేడ్ పానీయాలపై కూడా పన్ను విధించింది. ఈ చట్టం 2028 ప్రారంభంలో అమల్లోకి వస్తుందని ఆదాయపు పన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ కరిమా ముబారక్ అల్ సాది తెలిపారు. 

అయితే, కొన్ని మినహాయింపులు ప్రకటించారు. ఒమన్ సుల్తానేట్‌లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వారసత్వం, జకాత్, విరాళాలు, ప్రాథమిక గృహనిర్మాణం,  ఇతర సామాజిక పరిగణనలకు సంబంధించిన తగ్గింపులు, మినహాయింపులను కూడా ఈ చట్టంలో ప్రకటించారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను అమలుకు ముందు సమగ్ర అధ్యయనం నిర్వహించామని, ఇది మినహాయింపు పరిమితిని జాగ్రత్తగా పరిగణించిందని, ఒమన్ జనాభాలో దాదాపు 99 శాతం మంది ఈ పన్ను పరిధిలోకి రారని వెల్లడైందని ఒమన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com