మిడిలీస్ట్ లో సైనిక ఉద్రిక్తతలు..ప్రజల భద్రతపై GCC ఆందోళన..!!

- June 23, 2025 , by Maagulf
మిడిలీస్ట్ లో సైనిక ఉద్రిక్తతలు..ప్రజల భద్రతపై GCC ఆందోళన..!!

కువైట్: మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు కొనసాగడం ఈ ప్రాంత ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితిలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘర్షణ విస్తరించకుండా నిరోధించడానికి, ఆయా దేశాలు సంయమనం పాటించాలని GCC దేశాలు పిలుపునిచ్చాయని ఐక్యరాజ్యసమితిలో కువైట్ శాశ్వత ప్రతినిధి తారెక్ అల్-బనై తెలిపారు. జిసిసి తరపున ఈ ప్రాంతంలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో అల్-బనై ప్రసంగించారు.

ఇరాన్‌లోని అణు స్థావరాలపై తాజా వైమానిక దాడులను GCC బృందం పర్యవేక్షిస్తుందన్నారు.  అదే సమయంలో ఉద్రిక్తతలను  ఆపేందుకు భద్రతా మండలి,  అంతర్జాతీయ సమాజం తమ బాధ్యతను నిర్వర్తించాలని రాయబారి అల్-బనాయ్ కోరారు. ప్రస్తుత సంక్షోభాన్ని తగ్గించడానికి.. అందరి ప్రయోజనం కోసం భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు GCC దేశాలు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com