సరికొత్తగా అబుదాబిలోని యాస్ వాటర్‌వరల్డ్ వాటర్‌పార్క్..!!
- June 26, 2025
యూఏఈ: యాస్ వాటర్‌వరల్డ్ వాటర్‌పార్క్ విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయింది. జూలై 1న ప్రజలకు తెరవబడుతుందని మిరల్ ప్రకటించింది. అబుదాబిలోని యాస్ ద్వీపంలో ఉన్న ఈ విస్తరణ 13,445 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్త ప్రాంతం ప్రస్తుత సౌకర్యాలతో పాటు, కుటుంబ సభ్యులందరికీ కొత్త నీటి సవారీలు, వినోద కార్యకలాపాలను అందిస్తుందని అన్నారు.
వాటర్‌పార్క్ 'లాస్ట్ సిటీ' థీమ్‌ను పరిచయం చేస్తుంది. ఇది పార్క్ అసలు కథ 'ది లెజెండ్ ఆఫ్ ది లాస్ట్ పెర్ల్' యొక్క కొనసాగింపుగా ఉండనుంది. 20 కొత్త సవారీలు, స్లైడ్లు అన్ని వయసుల అతిథులకు వినోదంతో నిండిన కొత్త ఫుడ్ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త రైడ్లలో పిల్లల కోసం స్ప్లాష్ ల్యాండింగ్‌తో కూడిన ట్విస్టింగ్, ఎడారి వాటర్ స్లయిడ్ అయిన అల్ మాఫ్రాస్; ట్విస్టింగ్, క్లోజ్డ్ ఆక్వా ట్యూబ్ స్లయిడ్ అయిన రెడ్ డ్యూన్స్, హై-స్పీడ్ డ్రాప్స్, షార్ప్ ట్విస్ట్‌లు, హెడ్-టు-హెడ్ యాక్షన్‌తో ఈ ప్రాంతంలోని మొట్టమొదటి సైడ్-బై-సైడ్ డ్యూలింగ్ ట్యూబ్ రాఫ్ట్ రేస్ అయిన అల్ ఫలాజ్ రేస్ ఉంటాయని ప్రకటించారు. కొత్త రైడ్లలో కొన్ని మటాహా మ్యాడ్నెస్, సదాఫ్ స్విర్ల్, బహముట్స్ రేజ్, బాండిట్స్ ప్లేగ్రౌండ్ కూడా ఉన్నాయి. విస్తరణ ప్రాజెక్టులో పూర్తితో పార్క్ లో ఇప్పుడు 60 కి పైగా రైడ్లు, స్లయిడ్లు, ఆకర్షణలకు నిలయంగా మారిందదని, ఇది గతంలో కంటే ఎక్కువ వాటర్ సాహసాలను అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







