మిడిలీస్ట్ ఎఫెక్ట్.. జూలైలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా?

- June 26, 2025 , by Maagulf
మిడిలీస్ట్ ఎఫెక్ట్.. జూలైలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా?

యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు పెరిగినందున యూఏఈలో జులై నెలలో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

బ్రెంట్ ముగింపు ధర జూన్‌లో సగటున $69.87గా ఉంది. గత నెల $63.6గా ఉంది. బ్రెంట్ చమురు బ్యారెల్‌కు $60ల మధ్యలో ట్రేడవుతోంది. కానీ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రమవడంతో.. యూఎస్ కూడా ఈ వివాదంలో పాల్గొనడంతో అది బ్యారెల్‌కు $80కి పెరిగింది.

స్విస్ కోట్ బ్యాంక్ సీనియర్ విశ్లేషకుడు ఇపెక్ ఓజ్కార్డెస్కాయా మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయాలను పక్కన పెడితే, సరఫరా-డిమాండ్ డైనమిక్స్ చమురు ధరలకు అనుకూలంగా కొనసాగుతున్నాయని అన్నారు.  “వాణిజ్య అనిశ్చితుల కారణంగా ప్రపంచ డిమాండ్ అవకాశాలు బలహీనపడుతున్నాయి. అయితే సరఫరా పుష్కలంగా ఉంది. జూలై 6న జరగనున్న తదుపరి ఒపెక్+ సమావేశంలో మరోసారి ఉత్పత్తి పెంపునకు సిద్ధంగా ఉన్నామని రష్యా నిన్న తెలిపింది. కాబట్టి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పూర్తయితే, చమురు బ్యారెల్‌కు $60 స్థాయికి లేదా అంతకంటే తక్కువగా వచ్చే ఉండే అవకాశం ఉంది. ”అని ఆయన అన్నారు.

యూఏఈలో ఇంధన ధరల కమిటీ జూన్ నెలలో పెట్రోల్ ధరలలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం, సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 వరుసగా లీటరుకు Dh2.58, Dh2.47 మరియు Dh2.39 వద్ద ఉన్నాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com