లింక్ క్లిక్ చేసి, Dh2,500 పోగొట్టుకున్న బాధితుడు..యూఏఈలో కొత్త స్కామ్..!!
- June 26, 2025
యూఏఈ: దుబాయ్ నివాసి N.K. తన కాఫీ టేబుల్‌ను ఒక ప్రముఖ వెబ్సైట్లో ప్రీలవ్డ్ వస్తువులను అమ్మడానికి ప్రకటించినప్పుడు, మోసపోతానని అతినికి తెలియదు. “నా ప్రకటన వచ్చిన రెండవ రోజున, ఒక వ్యక్తి నాకు WhatsAppలో సందేశం పంపి, దానిని కొనడానికి ఆసక్తి చూపుతున్నానని చెప్పాడు. పేమెంట్ చేసేందుకు వీలుగా లింక్‌పై క్లిక్ చేసి నా కార్డ్ వివరాలను నమోదు చేయమని నన్ను అడిగింది. నేను లింక్‌పై క్లిక్ చేసి, నా వివరాలను ఇచ్చాను. వెంటనే నా ఖాతా నుండి Dh2,500 మాయమైంది.” అని తెలిపారు. N.K. వెంటనే తన కార్డును బ్లాక్ చేసి బ్యాంకుకు ఫిర్యాదు చేశాడు.
యూఏఈలో వేగంగా పెరుగుతున్న కొత్త స్కామ్‌లో చిక్కుకున్న వ్యక్తులలో N.K. ఒకరు. ఈ క్రమంలో టెక్ దిగ్గజం కరీమ్ తన పేరుతో జరుగుతున్న మోసానికి బలైపోవద్దని ప్రజలను హెచ్చరిస్తూ ఒక సలహా జారీ చేసింది. “చాలా మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. మాకు ఇప్పటికే Dh10,000 వరకు నష్టపోయిన ఫిర్యాదులు వచ్చాయి.” అని ప్రకటనలో పేర్కొన్నారు.
నకిలీ సైట్ ప్రివ్యూలలో వినియోగదారులకు careem.com గా కనిపించే కాపీ క్యాట్ URLని ఉపయోగించారు. కానీ క్లిక్ చేసిన తర్వాత నకిలీ వెబ్‌సైట్‌కు రూట్ అవుతుంది. కాబట్టి ఈ స్కామ్ “ముఖ్యంగా మోసపూరితమైనది” అని కంపెనీ వెల్లడించింది.
స్కామ్ ఎలా పనిచేస్తుందంటే?
స్కామ్ ఎలా పని చేస్తుందో అనేక మంది నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది ఎక్కువగా వస్తువులను అమ్మాలని చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంది. తాము అమ్ముతున్న వస్తువును కొనడానికి ఆసక్తి చూపిన విక్రేతను సంప్రదించిన తర్వాత, "కొనుగోలుదారు" విక్రేత క్రెడిట్ లేదా డెబిట్ కార్డులోకి డబ్బు చెల్లించి, దానిని తీసుకోవడానికి 'కరీం డెలివరీ' సేవను పొందవచ్చని పేర్కొన్నాడు.
స్కామర్ తర్వాత విక్రేతను CVV కోడ్‌తో సహా కార్డు యొక్కఅన్ని వివరాలను నమోదు చేయమని అడిగే లింక్‌ను పంపుతాడు. వివరాలు నమోదు చేసిన తర్వాత, స్కామర్ డబ్బును దొంగిలించి తన నంబర్‌ను వెంటనే తొలగిస్తాడు. కంపెనీ 'కరీం డెలివరీ' అనే పేరుతో సేవను అందించదు. బదులుగా, ఇది 'కరీం బాక్స్' సేవను అందిస్తుంది. దీనిని కస్టమర్లు రెండు ఎంచుకున్న ప్రదేశాల మధ్య చిన్న వస్తువులను పంపడానికి లేదా కెప్టెన్ స్టోర్ నుండి ఒక వస్తువును కొనుగోలు చేసి ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో డెలివరీ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ సేవ దుబాయ్‌లో మాత్రమే అందుబాటులో ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
"కరీం సేవలను అధికారిక యాప్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. ఏ మూడవ పార్టీ వెబ్సైట్లలో అందుబాటులో ఉండవు" అని ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు అనధికారిక URLలు, అసాధారణ చెల్లింపు అభ్యర్థనలు, పాప్-అప్ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ స్కామర్లను ఎదుర్కొన్న వారు షేర్ చేసిన స్క్రీన్షాట్లలో, URLలో స్పెల్లింగ్ లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యూఏఈ నివాసితులు స్కామ్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని, వారి కార్డ్ నంబర్లు, OTP లేదా అలాంటి ఏదైనా ప్రైవేట్ సమాచారాన్ని ఆన్లైన్లో లేదా ఫోన్లో ఎప్పుడూ వెల్లడించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్