అబుదాబిలో పిల్లలతో సరదాగా గడిపిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 28, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తాను నిజంగా 'ప్రజల అధ్యక్షుడు' అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అబుదాబిలో జరిగిన క్రీడా కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మరోసారి చర్చకు వచ్చింది. షేక్ మొహమ్మద్ పిల్లలతో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలు కూడా యూఏఈ ప్రెసిడెంట్ పై ముద్దుపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేయడం గమనార్హం.
క్రీడా దుస్తులు ధరించిన పిల్లలు అబుదాబిలోని ADNEC సెంటర్‌లో ఏటా జరిగే మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్ (ADSS)లో పాల్గొంటున్నారు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పాడెల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లు నిర్వహిస్తున్నారు. చిన్నారి అథ్లెట్లను ప్రోత్సహించడానికి స్వయంగా షేక్ మొహమ్మద్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవాసులతో మాట్లాడి, వారితో ఫోటోలకు పోజులిచ్చారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా