సామాజిక మీడియా ద్వారా ఇతరులకు హాని కల్గిస్తే ఏడాది జైలు, భారీ జరిమానా
- July 14, 2016
జెడ్డా: సామాజిక మీడియా ద్వారా ఇతరులకు హాని ఎవరైనా తలపెడితే, వారికి ఏడాది జైలుశిక్ష మరియు 500,000 ఎస్ ఆర్ వరకు జరిమానాను చెల్లించాల్సి ఉందని మానవ హక్కుల జాతీయ సంఘం (NSHR) ఆదేశించింది. ఈ సమాచారంను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోఒక ట్వీట్ చేయబడింది.
మానవ హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ముఫలీహ్ అల్ ఖహ్తానీ , తన విధిలో భాగంగా సమాజంలో మానవ హక్కుల సంస్కృతి కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మరియు చట్టంకు కట్టుబడి ఉండే సౌదీ ప్రజలను ప్రోత్సహించడానికి, సమాజంలో మానవ హక్కుల గూర్చి అవగాహన కల్పించేందుకు మరియు సుపరిచితుల పుస్తకాల ప్రచురించడం మరియు ట్వీట్లు పోస్ట్లు చేస్తున్నట్లు వివరించారు
అల్ ఖహ్తానీ కమ్యూనిటీ లో ఆధునిక మీడియా ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు, ముఖ్యంగా యువ ప్రజలలో ఈ మాధ్యమాన్ని ఉపయోగించి వివిధ నేరాలను పాల్పడుతున్నట్లు గణించినట్లు పేర్కొన్నారు.1428 రాజ శాసనం కింద సైబర్ వ్యతిరేక నేరాల చట్టం సంక్రమింపజేసింది" అతను వివరించాడు. మానవ హక్కుల జాతీయ సంఘం ట్విట్టర్ లో ప్రచురితమైన ఖాతాలో మొబైల్ ఫోన్ లో ఎవరినైనా దుర్భాషలాడటం ,కెమెరాతో ఫోటోలు తీయడం , సామాజిక మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత జీవితం గూర్చి అనవసర వాఖ్యలు చేయడం తదితర చేష్టలకు పాల్పడితే, వారికి ఏడాది జైలుశిక్ష మరియు 500,000 ఎస్ ఆర్ వరకు జరిమానాను చెల్లించాల్సి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









