తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు

- July 05, 2025 , by Maagulf
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక నాయకత్వ మార్పు చోటు చేసుకుంది.పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత, మాజి ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కొత్తగా పదవిలోకి ప్రవేశించారు.తెలంగాణ పర్యాటక ప్యాకేజీలు.

ప్రముఖుల హాజరు–ఘన స్వాగతం
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు.

భక్తి భావంతో ప్రారంభమైన ప్రయాణం
రామచందర్‌రావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సరస్వతీ దేవి ఆలయంలో, చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు.

బీజేపీకి కొత్త శక్తి–రామచందర్ రావు ప్రసంగం
బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీని ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తాం.కార్యకర్తల్ని నమ్ముకొని ముందుకు సాగతాం, అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com