ఫుజైరాలో బీచ్‌కి వెళ్లేవారికి సేఫ్టీ టిప్స్..ప్రమాదాలపై ఆందోళన..!!

- July 05, 2025 , by Maagulf
ఫుజైరాలో బీచ్‌కి వెళ్లేవారికి సేఫ్టీ టిప్స్..ప్రమాదాలపై ఆందోళన..!!

యూఏఈ: ఫుజైరా రెస్క్యూ బృందాలు గత సంవత్సరం ఎమిరాటీలు, ప్రవాసులు సహా 26 మందిని మునిగిపోకుండా కాపాడాయి.  అయినా, ఒకరు మరణించిన సంఘటన నమోదైంది.  వేసవిలో బీచ్ కు వచ్చేవారితో తీరప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అధికారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లు, పడవ లాంటి రక్షణలు ఉన్న చోటనే సముద్రంలోకి దిగాలని సూచించారు.   

ఈ సందర్భంగా కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు:

-బోటింగ్ చేసేటప్పుడు లేదా ఆఫ్‌షోర్‌లో ఈత కొట్టేటప్పుడు ఎల్లప్పుడూ లైఫ్ జాకెట్లు ధరించాలి.

-పర్యవేక్షణ లేని లేదా నిషేధించబడిన ప్రాంతాలకు దూరంగా ఉండండి.

-బయటకు వెళ్లే ముందు సముద్ర వాతావరణ అప్డేట్ లను తెలుసుకోవాలి.

- పిల్లలను నీటి దగ్గర ఎప్పుడూ పర్యవేక్షణ లేకుండా వదిలివేయవద్దు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com