గాజా కాల్పుల విరమణకు కృషి.. మాస్కోలో సౌదీ విదేశాంగ మంత్రి..!!
- July 05, 2025
మాస్కో: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ శుక్రవారం మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణను సాధించడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. పెరుగుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల మధ్య రియాద్ - మాస్కో మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలకు ఇది భేటీ ప్రతిబింబిస్తుందన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించాల్సిన అత్యవసర అవసరాన్ని సౌదీ మంత్రి చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)తో పూర్తిగా సహకరించాలని టెహ్రాన్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో మాస్కోలో జరగనున్న మొదటి రష్యన్-అరబ్ సమ్మిట్‌లో సౌదీ అరేబియా పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు లావ్రోవ్ తెలిపారు. "రష్యా-జిసిసి వ్యూహాత్మక టాక్స్" 8వ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 11న సోచిలో జరుగుతుందని లావ్రోవ్ వెల్లడించారు.
29వ సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో గౌరవ అతిథిగా చేరాలనే సౌదీ అరేబియా నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సంవత్సరం రష్యా -సౌదీ మధ్య దౌత్య సంబంధాలకు శతాబ్ది వార్షికోత్సవం అని లావ్రోవ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్