ఐఐటీ విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు
- July 14, 2016
ఐఐటీ అంటేనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థ.. అందులో ర్యాంకు రావడమే కష్టం. రిజర్వేషన్ లేని విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించాలి. వడ్డీలు అధికంగా ఉండటంతో రుణాలు తీసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారింది. దీంతో వారికి ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేసే విధంగా కేంద్రమానవవనరుల శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేయనున్నట్లు హెచ్ఆర్డీ అధికారులు చెబుతున్నారు. రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించే విధంగా రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.90వేల నుంచి రూ. రెండులక్షలకు పెంచిన విషయం విదితమే. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, నిరుపేదలకు ఫీజులో పూర్తి మినహాయింపు ఇవ్వడం జరిగింది. పెంచిన ఫీజు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులపై భారం పడకుండా 'విద్యాలక్ష్మి' పథకం కింద వడ్డీలేని రుణాలను మంజూరు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









