తండ్రయిన షేక్ మక్తూమ్..శుభాకాంక్షలు వెల్లువ..!!
- July 08, 2025
యూఏఈ: దుబాయ్ రాజకుటుంబంలో మరో వారసురాలు వచ్చింది. షేక్ మక్తూమ్ నాల్గవసారి తండ్రి అయ్యారు. అతని సోదరుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్.. ఈ మేరకు శిశువు పేరు మరియంతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
మార్చిలో తన నాల్గవ బిడ్డను స్వాగతించిన షేక్ హమ్దాన్ కు కూడా ఇది ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది. హింద్ అనే ఆడ శిశువు జన్మించింది. 2021లో జన్మించిన కవలలు రషీద్, షేఖాలతోపాటు 2023లో జన్మించిన మొహమ్మద్ జన్మించారు.
అబుదాబి క్రౌన్ ప్రిన్స్, ఈ సంవత్సరం మార్చిలో షేక్ జాయెద్ బిన్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అనే కుమారుడికి తండ్రి అయ్యాడు. దుబాయ్ నుండి అబుదాబి వరకు రాజకుంటుంబానికి ఆన్లైన్లో.. కమ్యూనిటీలో హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







