అందరికీ అందుబాటులో గూగుల్ ఏఐ మోడ్

- July 10, 2025 , by Maagulf
అందరికీ అందుబాటులో గూగుల్ ఏఐ మోడ్

ఇప్పుడు గూగుల్ (Google AI) సెర్చ్ ముందు మాదిరిగా ఉండదు. ‘ఏఐ మోడ్’ (‘AI Mode’) అనే శక్తివంతమైన ఫీచర్‌తో గూగుల్ వెతుకుల ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ ఫీచర్ ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుంది.ఇంతవరకు ప్రయోగాత్మకంగా కొద్దిమందికే ఇచ్చిన ఈ ఫీచర్, యూజర్ల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఇప్పుడు అందరికీ తెరిచింది. ఇకపై సెర్చ్ ల్యాబ్స్‌లో సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు.త్వరలో భారత్‌లోని యూజర్లకు గూగుల్ యాప్‌లోని సెర్చ్ బార్‌లో ఈ ఏఐ మోడ్ ప్రత్యక్షమవుతుంది. ఇది సెర్చ్‌ను మరింత వేగవంతంగా, అనుసంధానంగా మార్చుతుంది.

సాధారణ ప్రశ్నలకు సహజ సమాధానాలు
పిల్లలతో ఇంట్లో ఆడుకోవడానికి సరైన యాక్టివిటీలేంటని అడిగినా, ఏఐ మోడ్ క్లియర్‌గా సమాధానం చెబుతుంది. సంక్లిష్ట ప్రశ్నలకైనా సమగ్ర పరిష్కారాలు అందిస్తుంది.ఒకసారి అడిగిన ప్రశ్నకు తదుపరి చర్చ కొనసాగించవచ్చు. ఏఐ మోడ్ సమాధానాన్ని గుర్తుంచుకొని, అర్థవంతమైన కొనసాగింపునిస్తుంది. ఇది గూగుల్‌ను మరింత మానవీయంగా మార్చుతుంది.

వాయిస్ కమాండ్లు – చేతులేని అన్వేషణకు సహాయంగా
వాయిస్ ద్వారా కూడా గూగుల్‌ను నడిపించవచ్చు. టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, మాటలతోే సమాచారం పొందవచ్చు. ఇది దినసరి అన్వేషణను మరింత వేగవంతం చేస్తుంది.

గూగుల్ లెన్స్ తో దృశ్యాల ఆధారంగా సెర్చ్
ఫోటో తీసి దానికి సంబంధించి సమాచారం కావాలంటే, లెన్స్ ఉపయోగించొచ్చు. ఫొటోను స్కాన్ చేస్తే దానిని ఏఐ విశ్లేషించి స్పష్టమైన వివరాలు అందిస్తుంది.తేలికైన, వేగమైన, ప్రభావవంతమైన సెర్చ్‌కు ఇది మార్గం.ఈ ఏఐ మోడ్‌తో గూగుల్ సెర్చ్ పూర్తిగా మారనుంది. వాడటానికి సులభం, సమాధానాలు స్పష్టంగా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com