సలాలాకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?
- July 12, 2025
యూఏఈః ఖరీఫ్ వర్షాలు ఒమన్లోని ధోఫర్ గవర్నరేట్ను పచ్చని స్వర్గధామంగా మార్చాయి. దీంతో వేలాది మంది యూఏఈ నివాసితులు విహారయాత్ర కోసం సలాలాకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ శుక్రవారం ఉదయం ధోఫర్లో జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో, ప్రయాణికులు రాకపోకలు సాగించే ముందు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధోఫర్లో మూడు వాహనాలు ఢీకొని ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 11 మందిలో తొమ్మిది మంది ఎమిరాటీలు, వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.
ధోఫర్ను సమీపించగానే అకస్మాత్తుగా కొండలు, పొగమంచు, వర్షాలు పలుకరిస్తాయని, మొత్తం డ్రైవింగ్ స్టయిల్ మారిపోతుందని, కొన్ని సార్లు ఇది ప్రమాదకరంగా మారుతుందని సిలికాన్ ఒయాసిస్ నివాసి మరియు సాహసికుడు అబ్దుల్లా మస్రీ అన్నారు. తుర్మైత్ తర్వాత వాడి దవ్ఖా సమీపంలోని పర్వత రోడ్లలోకి ప్రవేశించగానే ప్రమాదకరమైన మలుపులు, నిటారుగా ఉన్న వాలులు, పొగమంచుతో డ్రైవింగ్ క్లిష్టంగా మారుతుందన్నారు.
నిపుణుల సూచనలు
ఆదరబాదరగా డ్రైవింగ్ చేయవద్దు. వేగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. అవసరమైతే ప్రయాణాన్ని రెండు రోజులుగా విభజించుకోవాలి.క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత, ముఖ్యంగా పర్వతాలలో డ్రైవింగ్ కు దూరంగా ఉండాలి. ధోఫర్లోకి ప్రవేశించే ముందు, డ్రైవర్లు తమ వాహనాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. టైర్లు మంచి గ్రిప్ కలిగి ఉండాలి. పొగమంచు కారణంగా దృశ్యమానత తరచుగా తగ్గుతుంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలి.
గ్రామీణ ప్రాంతాలలో ఆవులు, మేకలు, ఒంటెలు వంటి పశువులు ఊహించకుండా అడ్డు వస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్గంలో కొన్ని మలుపులు ఇరుకైనవి, షార్ప్ వంపులు ఉంటాయి. వేగ పరిమితి గంటకు 80 కి.మీ.కు అనుమతించినప్పటికీ వేగాన్ని తగ్గించడం చాలా అవసరం.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!