ఖతార్ లో 13.2% పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్ లావాదేవీలు..!!

- July 15, 2025 , by Maagulf
ఖతార్ లో 13.2% పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్ లావాదేవీలు..!!

దోహా: ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉంది. రెసిడెన్షియల్ సేల్స్ లావాదేవీలు త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 13.2 శాతం,  వార్షికంగా (YoY) 67.1 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.  Q1 కోసం ValuStrat రియల్ ఎస్టేట్ పరిశోధన ప్రకారం..  రెసిడెన్షియల్ యూనిట్ల సగటు టికెట్ పరిమాణం QR2.7 మిలియన్లుగా ఉంది. ఇది త్రైమాసికం ఆధారంగా 3.8 శాతం పెరుగుదలను నమోదు చసింది. అదే సమయంలో వార్షిక ప్రాతిపదికన 3.6 శాతం తగ్గుదలని నమోదు చేసి నిరాశపరిచింది. దోహా, అల్ దయీన్లలో అత్యధికంగా అమ్ముడుపోగా,  పెర్ల్ ఐలాండ్.. అల్ కస్సార్‌లలో అమ్మకాల విలువ 54.3 శాతం పెరిగింది. లావాదేవీల పరిమాణం 39.8 శాతం పెరిగింది.

Q1లో నివాస సరఫరాకు సంబంధించి, 2025 మొదటి త్రైమాసికంలో మొత్తం నివాస స్టాక్ 401,542 యూనిట్లు అని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 253,513 అపార్ట్‌మెంట్‌లు, 148,029 విల్లాలు ఉన్నాయి. ఈ త్రైమాసికంలో 2,000 అపార్ట్‌మెంట్‌లు డెలివరీ చేయబడినట్లు తెలిపారు.

గెవాన్ ఐలాండ్ (ది పెర్ల్)లో 690 యూనిట్లు, షాహద్ టవర్ (వెస్ట్ బే)లో 377 యూనిట్లు, లుసైల్ మెరీనాలోని FJ రెసిడెన్స్, వెనిస్ టవర్, నయెఫ్ టవర్ అంతటా 676 యూనిట్లు ఉన్నాయి. డార్ గ్లోబల్‌తో కలిసి ఖతారీ డియర్, సిమైస్మా కోస్టల్ ప్రాజెక్ట్ కింద ట్రంప్-బ్రాండెడ్ విల్లాలు, అంతర్జాతీయ-ప్రామాణిక గోల్ఫ్ కోర్సును కలిగి ఉన్న కొత్త అభివృద్ధి ప్రాజెక్టును ప్రకటించింది. SAK హోల్డింగ్ ఉసూల్ అల్ మన్సౌరా కాంపౌండ్‌ను ప్రారంభించింది.  ఇందులో స్టూడియోల నుండి మూడు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ల వరకు దాదాపు 500 యూనిట్లతో రెండు టవర్లు ఉన్నాయి. 62,218 చదరపు మీటర్ల మొత్తం నిర్మాణ విస్తీర్ణంతో ఉన్న ఈ ప్రాజెక్ట్ లీజుహోల్డ్ నిర్మాణం కింద అందిస్తున్నారు.  

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com