ఒలింపిక్స్‌లోకి క్రికెట్ రీఎంట్రీ..
- July 15, 2025
క్రికెట్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. సుమారు 128 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత, క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్ వేదికపై అడుగుపెట్టనుంది. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనుండగా.. నిర్వాహకులు తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులలో ఆనందోత్సాహాలను నింపింది.
ఒలింపిక్స్‌లో రీఎంట్రీ!
క్రికెట్ చివరిసారిగా 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆడారు. ఆ సమయంలో, గ్రేట్ బ్రిటన్ – ఫ్రాన్స్ మాత్రమే పాల్గొన్నాయి. చివరికి బ్రిటన్ రెండు రోజుల మ్యాచ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. తర్వాత ఒక్కసారి కూడా ఈ గేమ్‌కు అవకాశం రాలేదు. ఇప్పుడు లాస్ ఏంజెలెస్ వేదికగా ఈ చారిత్రాత్మక రీఎంట్రీ జరగనుంది.
పురుషులు, మహిళలకు వేరే విభాగాలు
ఈసారి క్రికెట్‌కి ప్రత్యేకత ఏంటంటే, పురుషులు – మహిళలు వేర్వేరు విభాగాల్లో పోటీ పడతారు. ప్రతి విభాగంలో ఆరు జట్లు బంగారు, వెండి, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. అన్ని మ్యాచ్‌లు T20 ఫార్మాట్‌లో జరగనుండగా.. దాదాపు ప్రతీ రోజు డబుల్-హెడర్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
లాస్ ఏంజెలెస్ 2028 క్రికెట్ షెడ్యూల్
- ఫుల్ షెడ్యూల్ : జూలై 12 – జూలై 29, 2028
- మహిళల క్రికెట్ (LA Olympics 2028)
- ప్రారంభ మ్యాచ్: జూలై 12, 2028
- రెండవ మ్యాచ్: జూలై 13, 2028
- మెడల్ మ్యాచ్‌లు: జూలై 20, 2028
- పురుషుల క్రికెట్ (LA Olympics 2028)
- ప్రారంభ మ్యాచ్: జూలై 22, 2028
- మెడల్ మ్యాచ్‌లు: జూలై 29, 2028
మహిళల ఈవెంట్ ముగిసిన వెంటనే పురుషుల ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఇలా జూలై నెల మొత్తం క్రికెట్ పండుగే…
మ్యాచ్ వేదిక
అన్ని మ్యాచ్‌లు ఫెయిర్‌గ్రౌండ్స్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియం డౌన్‌టౌన్ లాస్ ఏంజెలెస్‌కు 48 కిలోమీటర్ల దూరంలో, దాదాపు ఒక శతాబ్దంగా LA కౌంటీ ఫెయిర్‌కు ప్రసిద్ధిగా నిలిచింది. 2028 ఒలింపిక్స్‌లో ఇది ప్రపంచ క్రికెట్‌కు ఒక కొత్త కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది.
క్వాలిఫికేషన్ పై త్వరలో క్లారిటీ
ఒలింపిక్ క్రికెట్ షెడ్యూల్ విడుదల అయినా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇంకా క్వాలిఫికేషన్ ప్రక్రియపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై జూలై 17–20 మధ్య సింగపూర్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!