మచిలీపట్నంను ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కొల్లు రవీంద్ర
- July 17, 2025
విజయవాడ: మచిలీపట్నం నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులు లేకుండా రూపుమాపుతానని, ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్ కమిటీలో తాను కూడా సభ్యులుగా ఉన్నానని, ప్రతి మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత తాము నైపుణ్యాల అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అనే అంశాల పైన చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 1994లో ఒక విజన్ డాక్యుమెంట్ 2020 తయారుచేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థతో అనుసంధానమై హైదరాబాదులో హైటెక్ సిటీ ని నిర్మించారన్నారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన మనవాళ్లు ఐటి నిపుణులుగా ఉన్నారన్నారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి 201419 లో రాష్ట్ర ముఖ్యమంత్రి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఇకపై మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని నిరుద్యోగ యువతీ యువకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్న ఉద్యోగాలు లేదా వ్యాపారాలని మానుకోకుండా అందులో చేరి మెలకువలు నేర్చుకుని పెద్ద అవకాశాలు పొందాలన్నారు. నేడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆహారానికి సంబంధించిన ఆర్డర్ పెట్టుకోవాలంటే స్విగ్గి ని ఆశ్రయిస్తున్నారని, దాని రూపకర్త మన ఉయ్యూరు నివాసి హర్ష అందరికి స్ఫూర్తిదాయక మన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ క్వాంటం లేబరేటరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందన్నారు. మచిలీపట్నం నగరాన్ని ఒక ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు 2026 జూన్డిసెంబర్ నాటికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయి రవాణా రాకపోకలు మొదలవుతాయన్నారు. ఓడరేవు అనుబంధంగా పలు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. యువత ఖాళీగా ఉండి సమయం వృధా చేయరాదని తెలియజేశారు. గోవా షిప్పింగ్ కంపెనీ వారు ఓడల నిర్మాణానికి స్థలం కావాలని కోరుతూ ముఖ్యమంత్రితో ఎంఓయూ చేసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. సింహాద్రి టిఎంటి, వైజాగ్ వారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాల స్థలం కావాలని కోరారన్నారు.
ఆంధ్ర జాతీయ మచిలీపట్నం ఓడరేవు, మంగినపూడి బీచ్, జాతీయ రహదారులు, విమానాశ్రయం వంటి పలు రకాల సదుపాయాలు ఉన్నందున రానున్న రోజుల్లో మచిలీపట్నానికి మంచి భవిష్యత్తు రాబోతుందన్నారు. అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర జాతీయ కళాశాలకు వచ్చారని సమయంలో సమీపంలో చెత్తాచెదారాలను తొలగించి చెత్త లేకుండా చేయాలని సూచించారన్నారు. రానున్న అక్టోబర్ 2 తేదీ నాటికి ఈ ప్రాంతంలో చెత్తాచెదారం లేకుండా తొలగించి మంచి పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలకు పూర్వవైభవం రాబోతోందని, ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు రీసెర్చ్ సెంటర్ ను నెలకొల్పేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ఒక చిన్న ఆలోచన చాలా మార్పులకు నాంది పలుకుతుందన్నారు. మంగినపూడి బీచ్ ఉత్సవం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసిందన్నారు పర్యాటక రంగ అభివృద్ధికి ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి స్వదేశీ దర్శన్ నిధులు పొందుట కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. గనుల శాఖలో కూడా చాలా పరిశోధన అవకాశాలు ఉన్నాయని, ఒక క్రిటికల్ మినరల్ పార్క్ మచిలీపట్నంలో ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఖనిజాలను ప్రాసెస్ చేసి విదేశాలకు పంపడం, విదేశాల నుండి ముడి సరుకులు తెప్పించడం వంటి ప్రక్రియను 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నామని తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు .
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!