గల్ఫ్ ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకురాలు శ్యామల దివాకరన్ కన్నుమూత..!!

- July 18, 2025 , by Maagulf
గల్ఫ్ ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకురాలు శ్యామల దివాకరన్ కన్నుమూత..!!

కువైట్: గల్ఫ్ ఇండియన్ స్కూల్ (GIS) వ్యవస్థాపకురాలు,మాజీ ప్రిన్సిపాల్ శ్యామల దివాకరన్ మరణించారు.శ్యామల దివాకరన్ రెండు దశాబ్దాలకు పైగా గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు.ఆమె పదవీకాలం పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యయనాన్ని లిఖించారు.కువైట్‌లోని అత్యంత గౌరవనీయమైన భారతీయ విద్యా సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారని సంతాప సందేశంలో పాఠశాల యాజమాన్యం తెలిపింది.  కువైట్‌లోని విద్యా రంగానికి ఆమె అందించిన సేవలను విద్యార్థులు, మేనేజ్ మెంట్ ఎప్పటికీ స్మరించుకుంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com