దుబాయ్ లోని విల్లాలో చోరీ..5 మందికి జైలు శిక్ష..!!
- July 18, 2025
యూఏఈ: దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలోని విల్లాలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన గడియారాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్న సేఫ్‌ను దొంగిలించినందుకు మధ్య ఆసియా దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు తన తీర్పులో ఆదేశించింది. సదరు వ్యక్తులు విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఇంటి యజమానులు విదేశాలకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.
సీసీ కెమెరాల ఫుటేజ్, అద్దె వాహన రికార్డుల ద్వారా అనుమానితులను గుర్తించామని ఇన్వెస్టిగేషర్ టీములోని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితులు చోరీకి ఉపయోగించిన కారును అనుమానితులలో ఒకరు లీజుకు తీసుకున్నారని, ఆ బృందం మరొక ఎమిరేట్‌లోని అద్దె అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







