సౌదీ అవిభక్త కవలకు 12.5 గంటల శస్త్రచికిత్స విజయవంతం..!!

- July 18, 2025 , by Maagulf
సౌదీ అవిభక్త కవలకు 12.5 గంటల శస్త్రచికిత్స విజయవంతం..!!

రియాద్:  సౌదీ వైద్య, శస్త్రచికిత్స బృందం గురువారం అవిభక్త కవలలు యారా , లారాలను 12.5 గంటల పాటు శ్రమించి, అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా విజయవంతంగా వేరుచేసి వైద్యరంగంలో కొత్త మైలురాయిని సృష్టించింది. రియాద్‌లోని నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలో భాగమైన కింగ్ అబ్దుల్లా స్పెషలిస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ జరిగింది.

ఏడు నెలల కవలలు పొత్తి కడుపు, కటి భాగంలో కలిసి, పెద్దప్రేగు, పురీషనాళం, మూత్ర, పునరుత్పత్తి వ్యవస్థలు,  కటి ఎముక భాగాలను పంచుకున్నారని రాయల్ కోర్టు సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్‌వైజర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ తెలిపారు. పీడియాట్రిక్ సర్జరీ, అనస్థీషియా, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జరీ , నర్సింగ్‌లో కన్సల్టెంట్లతో సహా 38 మంది నిపుణుల బృందం ఈ సున్నితమైన ఆపరేషన్‌లో పాల్గొని వారిని విజయవంతంగా వేరు చేశారు, వారిద్దరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఈ తరహా 65వ విజయవంతమైన ఆపరేషన్ అని, గత 35 సంవత్సరాలలో 27 దేశాల నుండి 150 అవిభక్త కవలల కేసులను డీల్ చేసినట్లు తెలిపారు. 

 శస్త్రచికిత్స చేసిన బృందం అసాధారణ కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సౌదీ అరేబియా వైద్య నైపుణ్యం,  మానవ గౌరవం పట్ల నిరంతర నిబద్ధతకు నిదర్శనంగా అభివర్ణించారు. అలాగే, యారా - లారా కుటుంబ సభ్యులు సౌదీ నాయకత్వానికి , వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com