నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
- July 18, 2025
హైదరాబాద్: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఆయన వయసు 53 ఏళ్లు. హైదరాబాద్ చందానగర్ పీఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్.ముషీరాబాద్ లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు.100కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్