#Mega157-కేరళలో కీలకమైన సన్నివేశాలు & డ్యూయెట్ సాంగ్ షూటింగ్
- July 19, 2025
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ #Mega157 షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తోంది.
చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో అద్బుతమైన సాంగ్ ని కంపోజ్ చేశారు. పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. అలాగే కొన్నికీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23కి పూర్తవుతుంది.
ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్డ్గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
#Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
అడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
పీఆర్వో - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం