రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా

- July 20, 2025 , by Maagulf
రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా

హైదరాబాద్: తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

పాతబస్తీ నుంచి తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "నాటు నాటు" పాట ద్వారా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు. తన కష్టమే తన విజయానికి కారణమని నిరూపించిన రాహుల్, తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, రాహుల్‌కి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ, బోనాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

ఇటీవల జరిగిన గద్దర్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం నుండి బహుమతి ప్రకటన ఉంటుందని సూచించారు. ఆ ప్రకటనకు అర్థం ఇవాళ పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పష్టమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com