కువైట్ ప్రధానమంత్రిని కలిసిన భారత రాయబారి..!!

- July 22, 2025 , by Maagulf
కువైట్ ప్రధానమంత్రిని కలిసిన భారత రాయబారి..!!

కువైట్: ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాను బయాన్ ప్యాలెస్‌లో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ -కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శకత్వం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిసెప్షన్‌లో ప్రధానమంత్రి దివాన్ తాత్కాలిక అధిపతి షేక్ ఖలీద్ మొహమ్మద్ అల్-ఖాలీద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com