ట్రాలీ బ్యాగులను నిషేధించిన స్కూల్స్..కారణం ఇదేనా?

- July 22, 2025 , by Maagulf
ట్రాలీ బ్యాగులను నిషేధించిన స్కూల్స్..కారణం ఇదేనా?

యూఏఈరాబోయే విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ట్రాలీ బ్యాగులతో పంపవద్దని యూఏఈలోని పలు  పాఠశాలలు నోటీసులు జారీ చేశాయి. పిల్లల కోసం స్కూల్ బ్యాగ్ ఎంపికను పునఃపరిశీలించాలని కోరుతూ స్కూల్స్ సర్క్యులర్‌లను పంపుతున్నాయని పేరెంట్స్ చెబుతున్నారు.  స్కూల్ బ్యాగ్ ఎంచుకునేటప్పుడు సౌలభ్యం లేదా ట్రెండ్‌ల కంటే భద్రత, స్మార్ట్ అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తల్లిదండ్రులను కోరుతున్నారు.

గత సంవత్సరం ఆగస్టులో అబుదాబి అధికారులు విద్యార్థుల బ్యాక్‌ప్యాక్ వారి శరీర బరువులో 20 శాతం మించకూడదని స్పష్టం చేసింది. అప్పటి నుండి, ఎమిరేట్స్ అంతటా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి తేలికైన బ్యాగ్ విధానాలను అమలు చేస్తున్నాయి. 

భద్రత ముఖ్యం

ఈ మార్పు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేస్తుందని, ఇది విద్యార్థి-కేంద్రీకృత చొరవ అని వుడ్‌లెం ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నౌఫాల్ అహ్మద్ అన్నారు. ట్రాలీ బ్యాగ్‌లతో అనేక సమస్యలు వస్తయని తెలిపారు. ట్రాలీ బ్యాగ్ లను లాగడం వల్ల శారీరక ఒత్తిడి, మెట్లపై జారిపడే ప్రమాదాలు, అధిక శబ్దం వంటివి ఉన్నాయి. ట్రాలీ బ్యాగులు తరగతి గదుల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. 

బ్యాగుల భారాన్ని తగ్గించడానికి, వుడ్‌లెమ్ పాఠశాలలు తమ BYOD (బ్రింగ్ యువర్ ఓన్ డివైస్) విధానాన్ని, ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను బలోపేతం చేస్తున్నాయి. ఇవి భారీ పాఠ్యపుస్తకాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని తెలిపారు. క్యాంపస్‌లో లాకర్లు అందుబాటులో ఉన్నందున, విద్యార్థులు తేలికైన, ఎర్గోనామిక్ బ్యాక్‌ప్యాక్‌లలో అవసరమైన వాటిని మాత్రమే తీసుకురావాలని కొన్ని స్కూల్స్ ప్రోత్సహిస్తున్నారు.

 ప్రమాదాలు

యూఏఈలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు కూడా స్కూల్స్ ఆందోళనలకు మద్దతు తెలిపారు.  ట్రాలీ బ్యాగులు చాలా మంది ఊహించినంత సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ట్రాలీ బ్యాగులు వీపుపై ప్రత్యక్ష ఒత్తిడిని తగ్గించవచ్చు, కాని అవి అంత సురక్షితం మాత్రం కాదుని తెలిపారు. ట్రిప్పింగ్ ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అక్కడ ట్రాలీ బ్యాగులను ఉపయోగించడం వల్ల చేతి మణికట్టు,  భుజంపై ఒత్తిడి కూడా పెరుగుతుందన్నారు.  ముఖ్యంగా పిల్లలు ట్రాలీ బ్యాగులను మెట్ల మీదకు లేదా కాలిబాటల మీదుగా మోసుకెళ్తారని, దీని వలన ప్రయోజనం ఉండదని, పైగా వారికి గాయాల ప్రమాదం పెరుగుతుందని మెడ్‌కేర్ రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అమర్ ఎల్ జవహ్రీ వివరించారు. NMC రాయల్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ డాక్టర్ మలీహా రఫీక్ ప్రకారం.. ట్రాలీ బ్యాగులను సరిగా ఉపయోగించకపోవడం వల్ల అనేక రకాల కండరాల సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com