కువైట్ జనాభా 5 మిలియన్లు.. భారతీయులే టాప్..!!
- July 24, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కువైట్ జనాభా అధికారికంగా 5 మిలియన్ల మార్కును దాటింది. తాజాగా 5.098 మిలియన్లకు చేరుకుంది. ఇందులో 30% మంది కువైట్ పౌరులు(1.55 మిలియన్లు), మిగిలిన 70%(3.547 మిలియన్లు) ప్రవాసులు.
జనాభాలో 17% మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, 80% మంది 15 మరియు 64 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు మరియు 3% మంది మాత్రమే 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారని డేటా తెలిపింది.
భారతీయులు అతిపెద్ద ప్రవాస సమూహంగా ఉన్నారు. 1.036 మిలియన్లు(మొత్తం జనాభాలో 29% మంది) ఉన్నారు. ఈజిప్షియన్లు 661,000 మంది(19%) ఉన్నారు. కువైట్లో ఎక్కువ మంది ప్రైవేట్ గృహాలలో నివసిస్తున్నారు. దాదాపు 4.05 మిలియన్ల మంది సామూహిక గృహాలలో నివసిస్తున్నారు.
కార్మికశక్తి, ఉపాధి
కువైట్ కార్మిక మార్కెట్లో 2.283 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 520,000 మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. 1.76 మిలియన్లు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. మొత్తం జనాభాలో కార్మికులు 45% ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో కువైటీలు 75.5% ఉన్నారు. ఆ తరువాత భారతీయులు, ఈజిప్షియన్లు ఉన్నారు. ప్రైవేట్ రంగంలో భారతీయ కార్మికులు 31.2%, ఈజిప్షియన్లు 24.8% ఉన్నారు. ప్రైవేట్ రంగంలో కువైట్ జాతీయులు 3.8% మాత్రమే పనిచేస్తున్నారు. ఇక కువైట్ పురుషులు 32%, మహిళల 31% మంది ఉపాధి పొందుతున్నారు.
గృహ కార్మికులు, వైవాహిక స్థితి
కువైట్లోని గృహ కార్మిక మార్కెట్ ఎక్కువగా 10 దేశాలకు చెందిన మొత్తం 822,000 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో మహిళలు 58.2% ఉన్నారు. కువైట్ మొత్తం శ్రామిక శక్తిలో గృహ కార్మికులు 26%, జనాభాలో 16% ఉన్నారు. భారతీయులు మళ్ళీ ఈ విభాగంలో 41.3% ముందువరుసలో ఉండగా, ఆ తర్వాత ఫిలిప్పీన్స్, శ్రీలంకన్లు ఉన్నారు.
ఇక వైవాహిక స్థితి పరంగా దాదాపు 2.3 మిలియన్ల మంది వివాహం చేసుకున్నారు. 1.7 మిలియన్లు అవివాహితులు ఉన్నారు. విడాకులు తీసుకున్న వ్యక్తుల సంఖ్య దాదాపు 125,000 గా ఉంది. ప్రవాస మహిళలతో పోలిస్తే విడాకులు తీసుకున్న వారి సంఖ్య కంటే కువైట్ మహిళా రెండింతలు ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







