సినిమా రివ్యూ: ‘హరి హర వీరమల్లు’

- July 24, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘హరి హర వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకా వస్తున్న తొలి చిత్రమిది. అసలు ధియేటర్లలోకి వచ్చే సినిమా కాదిది అనుకున్నారంతా. కానీ, అనుకోకుండా షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా.. భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అందులోనూ లాస్ట్ మినిట్‌లో పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో కనిపించి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అది సినిమాపై అంచనాల్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. నిద్రాణంలో వున్న పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కడ లేని వుత్తేజం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ చివరిలో చేసిన ప్రమోషన్స్ హంగామా. అయితే, ఆ హంగామా..ఇంటర్వ్యూల కోసం నిర్విరామంగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం పలించిందా.? సినిమా ఆశించిన విజయం అందుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
16 వ శతాబ్ధంలో జరిగిన కథ ఇది. హిస్టరీని బేస్ చేసుకుని, కొంత కల్పిత గాధతో ఈ సినిమాని తెరకెక్కించారు. 16వ శతాబ్ధంలో కొల్లూరు ప్రాంతంలో దొరికిన కోహినూర్ వజ్రాన్నితనదైన క్రూరత్వంతో చేజిక్కించుకుంటాడు అప్పటి మొగలాయిల పాలకుడు ఔరంగజేబు (బాబీ డియోల్). భారత దేశంలో మత మార్పిడి చేసుకోవడం తప్ప వేరే బతుకు లేదనీ, అలా కాక హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను చెల్లించాలని ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు.అదే క్రమంలో గోల్కొండ నవాబు కుతుబ్ షాహి బందరు నుంచి అత్యంత విలువైన వజ్రాల్ని తన సైన్యంతో తెప్పిస్తాడు.ఆ వజ్రాల పై కన్నేస్తాడు అత్యంత తెలివైన వజ్రాల చోరుడు హరి హర వీరమల్లు( పవన్ కళ్యాణ్).తనదైన వీరత్వంతో ఆ వజ్రాల్ని కాజేస్తాడు. వీరమల్లు వీరత్వం తెగువ గురించి తెలుసుకున్న నవాబ్ కుతుబ్‌షాహి, వీరమల్లును తన వద్దకు పిలిపించుకుని అత్యంత కష్టతరమైన కార్యం అప్పచెబుతాడు.అదే శత్రుదుర్భేధ్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంపై దండెత్తి అతని వద్ద వున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తన వద్దకు తీసుకురావడం. ఆ పనిని ఒప్పుకుంటాడు వీరమల్లు. అసలు ఎందుకు అంత కష్టమైన పనిని వీరమల్లు ఒప్పుకున్నాడు.? జౌరంగజేబుకీ, వీరమల్లుకీ గతంలో ఏమైనా ప్రతీకారాలున్నాయా.? అసలు వీరమల్లు ఎవరు.? సప్తమి (నిధి అగర్వాల్) ఎవరు.? ఆమెని వీరమల్లు ఎందుకు విడిపించాడు.? ఢిల్లీ రాజు ఔరంగజేబుని ఎదుర్కొని కోహినూర్ వజ్రాన్ని వీరమల్లు దక్కించుకున్నాడా.? ఈ ఫ్రశ్నలకు సమాదానం దొరకాలంటే ‘హరి హర వీరమల్లు’ సినిమాని ఖచ్చితంగా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు:
లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రమిది. అయినా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. స్టంట్ సీన్లలో ఆయన చూపించిన కష్టం తెరపై సుస్పష్టంగా కనిపించింది. వీరమల్లుగా ఆయనకిచ్చిన ఎలివేషన్ సీన్లు ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయ్. ఫ్యాన్స్‌కి వీరమల్లు విశ్వరూపం ఫుల్ మీల్స్‌లా వుంటుంది. ఇంతకు ముందెన్నడూ లేనంత ఎనర్జిటిక్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఈ సినిమాలో. లేట్ అయినా లేటెస్ట్‌గా ఈ సినిమాని అతి తక్కువ టైమ్‌లో ఇంత పర్‌ఫెక్ట్‌గా పూర్తి చేయడం నిజంగా ఓ సర్‌ప్రైజింగ్ అంశమే. సప్తమి పాత్ర నిజంగానే నిధి అగర్వాల్‌కి దక్కిన అదృష్టమే. ఆ పాత్రలో నిధి చాలా అందంగా కనిపించడమే కాకుండా.. ఆమె పాత్రకున్న ట్విస్ట్ నిజంగా సూపర్బ్. ఈ పాత్ర కోసమే ఇన్ని రోజులు నిధికి అదృష్టం దక్కలేదా.! అన్నట్లుగా ఆ పాత్రలో నిధి అగర్వాల్ పరకాయ ప్రవేశం చేసింది. మరో ముఖ్య పాత్రధారుడు బాబీ డియోల్. ఔరంగజేబు పాత్ర గురించి చాలా పుస్తకాల్లో చాలా చాలా చదువుకున్నాం. అతని క్రూరత్వం గురించి తెలుసుకున్నాం. నిజంగానే ఔరంగజేబు ఇలా వుంటాడా.? ఇంత క్రూరుడా.? అని ఈ సినిమా చూశాకే తెలుస్తుంది. అంతలా ఆ పాత్రలో తన ప్రభావాన్ని చూపించాడు బాబీ డియోల్. మిగిలిన పాత్రధారులు సునీల్, నాజర్, సుబ్బరాజు, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:                                                                                                      ఈ సినిమాని అంకురార్పణ చేసింది దర్శకుడు క్రిష్ అయినప్పటికీ దాన్ని విజయవంతంగా పూర్తి చేసి తెరపై ఆవిష్కరించేలా చేసింది ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ.పవన్ కల్యాణ్ వంటి ఓ బిజీయెస్ట్ రాజకీయ నాయకుడ్ని హీరోగా తీసుకుని తనకున్న తక్కువ టైమ్‌లో ఇలాంటి ఓ పీరియాడిక్ మూవీని పూర్తి చేయడమంటే చిన్న విషయం కాదు. అందులో నూటికి నూరు మార్కులేయించేసుకున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. తండ్రి రత్నం ప్రోత్సాహం ఈ సినిమాకి మెండుగా వుంది.ఇక, ఈ సినిమా ఇంత విజయవంతంగా రావడానికి మెయిన్ అస్సెట్ మ్యూజిక్. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. పవన్ కళ్యాణ్‌తో కీరవాణి చేసిన మొదటి సినిమా ఇది. సందు దొరికినప్పుడల్లా తన ఆస్కార్ టాలెంట్ మొత్తం కుమ్మరించేసి, తనకు అదృష్టంగా భావించిన ఈ అవకాశాన్ని సంతృప్తిగా సద్వినియోగం చేసేసుకున్నాడు కీరవాణి. కీరవాణి మ్యూజిక్‌తో హరి హరవీరమల్లు నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకుంది.అలాగే, సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి సూపర్బ్‌గా సెట్ అ య్యింది. పీరియాడిక్ సెట్టింగ్స్..యాక్షన్ ఎపిసోడ్స్.. పాటలు విజువల్‌గా చక్కగా కుదిరాయ్. సెకండాఫ్‌లో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ఫోకస్ ఎక్కువ పెట్టి వుండాల్సింది. మాటలు బాగున్నాయ్. సందర్భానుసారం వచ్చిన పాటలు బాగున్నాయ్.నిర్మాణ విలువల గురించి మాట్టాడుకోవడానికేముంది.రత్నం గుండెకాయలా ఈ సినిమాని కాపాడుకుంటూ వచ్చారు.ఓవరాల్‌గా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టారు. ప్రీమియర్స్‌తోనే మ్యాగ్జిమమ్ వసూళ్లు రాబట్టేశారు.ఇక, ఫస్ట్ డేకే బ్రేక్ ఈవెన్ పక్కా అంటున్నారు. 

ప్లస్ పాయింట్స్:
పవన్ కల్యాణ్, యాక్షన్ ఘట్టాలు, కీరవాణి మ్యూజిక్, సనాతన ధర్మం ప్రధానాంశంగా ఎంచుకున్న ఈ సినిమా కథ, కథనం మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
సెకండాప్‌లో అక్కడక్కడా తేలిపోయిన విజువల్స్, కొన్ని వీక్ గ్రాఫిక్స్.. ఇలా చాలా కొద్దిపాటి కారణాలే.. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేవు అవి కూడా.

చివరిగా:
సనాతన ధర్మం కోసం రియల్‌ హీరోగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం చూశాం డిప్యూటీ సీఎం హోదాలో. అదే సనాతన ధర్మం కోసం రీల్ హీరో అయితే  ఆకాశమే హద్దుగా ఎలా తన వీరత్వం చూపిస్తాడో వీరమల్లుగా తన ప్రతాపం ఏంటో చూపించాడు. వినాల వీరమల్లు చెబితే వినాల.. చూడాల.. ‘హరి హర వీరమల్లు’ సినిమా పెద్ద తెరపై ఖచ్చితంగా చూడాల.! చూసి తీరాల.!

గల్ఫ్ లో ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ Phars Film Co. LLC.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com