అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ రైడ్స్
- July 24, 2025
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులు జరిపింది.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదుచేసిన రెండు FIRల ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 35 ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదీదీ, 50కి పైగా సంస్థల ఆఫీసులు, రికార్డులను తనిఖీ చేసినట్టు అధికారులు తెలిపారు. 25 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈడీ ప్రాథమిక విచారణలో “బ్యాంకులు, షేర్‌హోల్డర్లు, పెట్టుబడిదారులు, ఇతర ప్రజా సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనం దారి మళ్లించే ఘాటైన కుట్ర” ఉందని గుర్తించారు. ఇందులో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల అధికారులు, ముఖ్యంగా యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్ల పాత్రపై కూడా దృష్టి సారించారని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం.. 2017 నుండి 2019 మధ్య యస్ బ్యాంక్, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన RAAGA కంపెనీలకు సుమారు రూ.3,000 కోట్లు లోన్‌లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ లోన్‌లు మంజూరు చేసే ముందు యస్ బ్యాంక్ ప్రమోటర్ల వ్యక్తిగత కంపెనీల్లోకి డబ్బులు పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అప్పులను తిరిగి చెల్లించేందుకు కొత్త లోన్‌లు ఇవ్వడం
దర్యాప్తులో బయటపడిన అంశాల్లో ఆర్థిక స్థితిగల సంస్థలకు లోన్‌లు మంజూరు చేయడం, అవే డైరెక్టర్లు మరియు అడ్రెస్సులతో అనేక సంస్థలు రిజిస్టర్ చేయడం, అవసరమైన డాక్యుమెంటేషన్ లేకుండా లోన్‌లు మంజూరు చేయడం, షెల్ కంపెనీలకు నిధులు మళ్లించడం, అప్పులను తిరిగి చెల్లించేందుకు కొత్త లోన్‌లు ఇవ్వడం వంటి విషయాలు ఉన్నాయి.ఈ వ్యవహారంలో యస్ బ్యాంక్ అధికారులూ పలు కోణాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభాలు పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పలు బ్యాంకులు ఈడీ కి నివేదికలు
ఈ కేసుపై నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కూడా తమ నివేదికలను ఈడీకి అందించాయి. SEBI నివేదిక ప్రకారం.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ లోన్ పోర్ట్‌ఫోలియో 2017-18లో రూ.3,742 కోట్ల నుండి 2018-19లో రూ.8,670 కోట్లకు పెరిగినట్లు గుర్తించారు.మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCom) మరియు అనిల్ అంబానీని “ఫ్రాడ్” ఖాతాలుగా ప్రకటించింది.ఈ ఆరోపణలు కొత్తవి కావు, 2020లో కూడా SBI ఈ అకౌంట్లను ఫ్రాడ్‌గా ప్రకటించి, 2021లో CBIలో ఫిర్యాదు చేసింది.అయితే తర్వాత ఢిల్లీ హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలు ఇవ్వడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!