ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- July 24, 2025
అమరావతి: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. SIPB పెట్టుబడులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సుమారు 50వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీని ఆమోదించింది.సీఆర్డీయే నిర్ణయాలకు అనుమతి ఇచ్చింది.మరోవైపు సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంపై చర్చించారు.సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
50కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు.వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో విశ్రాంత న్యాయమూర్తి నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నాలా ఫీజు అంశంపైనా చర్చించారు. రెవెన్యూతో పాటు పంచాయతీ శాఖ అంశాలు నాలాతో ముడిపడి ఉండటంతో వచ్చే కేబినెట్ లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు.
విశాఖ, విజయవాడ మెట్రో రైలు అంశంపైనా డిస్కస్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మెట్రో రైలు ముందుకు తీసుకెళ్లాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. పదేపదే ఇలా నిబంధనలు అతిక్రమించే వారికి అవకాశాలు ఇస్తే ఎలా అన్న ప్రశ్నించారు. ఇకపై కఠినంగా ఉండాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ అంశంపై మరింత లోతుగా విశ్లేషించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులకు వివరించారు సీఎం చంద్రబాబు.
క్యాబినెట్ నిర్ణయాలు..
- 16వేల 466 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ సంస్థ అంగీకారం
- సిఫీకి భూకేటాయింపు, ప్రభుత్వ సహకారం
- పలు కంపెనీలకు భూకేటాయింపులు
- విశాఖను ఐటీ హబ్ గా మార్చేలా కార్యాచరణ
మంత్రివర్గం సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో హాట్ కామెంట్స్ చేశారు. సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులతో పంచుకున్నారు. జగన్ కారణంగా సింగపూర్ తో సత్సంబంధాలు తగ్గాయన్నారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ సింగపూర్ తో మైత్రి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. జగన్ చెడగొట్టిన బ్రాండ్ ను మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పెట్టినా 9వేల కోట్ల రూపాయల బాండ్స్ వచ్చాయని తెలిపారు చంద్రబాబు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!