భారత పాస్‌పోర్ట్ తో 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం..!!
- July 25, 2025
యూఏఈ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత పాస్‌పోర్ట్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకుంది.గత సంవత్సరం ఇది 85వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని అతిపెద్ద ఆరు నెలల ర్యాంక్ గా గుర్తింపు సాదించింది. భారత పాస్‌పోర్ట్ హోల్డర్ల వీసా లేకుండా ప్రయాణించే గమ్యస్థానాల సంఖ్య 57 నుండి 59కి స్వల్పంగా పెరిగింది.
ఇక యూఏఈ, చైనా, సౌదీ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో యూఏఈ 8వ స్థానంలో ఉంది. చైనా 34 స్థానాలు ఎగబాకి 60వ స్థానానికి చేరుకుంది. 2025లో బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాలతో పాటు బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలకు వీసా-రహిత ఎంట్రిని చైనా జోడించింది.
సింగపూర్ 227 గమ్యస్థానాలలో 193 గమ్యస్థానాలకు వీసా-రహిత సూచికలో తన స్థానాన్ని నిలుపుకుంది. జపాన్ , దక్షిణ కొరియా 190 గమ్యస్థానాలతో దగ్గరగా ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా ఏడు EU దేశాలు మూడవ స్థానాన్ని పంచుకోగా, న్యూజిలాండ్ గ్రీస్, స్విట్జర్లాండ్‌లతో కలిసి ఐదవ స్థానంలో నిలిచింది.
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న యూఎస్, యూకే తమ ర్యాంకులను కోల్పోయాయి. యూకే 186 గమ్యస్థానాలకు యాక్సెస్‌తో ఆరవ స్థానానికి పడిపోయింది. యూఎస్ 182తో 10వ స్థానానికి పడిపోయింది. ఇండెక్స్ ప్రకారం.. US మొదటి పది స్థానాల నుండి పూర్తిగా బయటకు వచ్చే ప్రమాదం ఇదే మొదటిసారి.
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత దేశాలు
ఆఫ్రికా (19 దేశాలు): అంగోలా, బురుండి, కేప్ వెర్డే దీవులు, కొమోరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, నమీబియా, రువాండా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా.
ఆసియా (18 దేశాలు): ఇండోనేషియా, కజకిస్తాన్, మకావో, మలేషియా*, మాల్దీవులు, మంగోలియా, ఫిలిప్పీన్స్, ఖతార్, శ్రీలంక, థాయిలాండ్* తైమూర్-లెస్టే.
ఉత్తర అమెరికా (10 ప్రాంతాలు): బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్.
ఓషియానియా (10 దేశాలు): కుక్ దీవులు, ఫిజి, కిరిబాటి, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నియు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు.
వీసా-ఆన్-అరైవల్ / ఇ-వీసా యాక్సెస్
ఈ గమ్యస్థానాలు వీసా-ఆన్-అరైవల్ లేదా ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా) సౌకర్యాలను అందిస్తాయి: మకావు, మయన్మార్, నేపాల్, భూటాన్, కంబోడియా, లావోస్, టాంజానియా, జింబాబ్వే, జోర్డాన్, కెన్యా, బొలీవియా, ఇరాన్, మలావి.
యూఏఈలో నివసించడం వల్ల అనేక దేశాలు సులభంగా ప్రవేశించవచ్చు. హెన్లీ & పార్టనర్స్ ప్రకారం, యూఏఈలోని భారతీయ నివాసితులు యూఏ నివాసిగా 58 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని పొందవచ్చు. చెల్లుబాటు అయ్యే యూఏఈ నివాస అనుమతిని కలిగి ఉండాలి. వాటిలో కొన్ని బ్రిటిష్ వర్జిన్ దీవులు, ఫిజి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మారిషస్, ఖతార్, సెనెగల్, సీషెల్స్, శ్రీలంక, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, థాయిలాండ్, ట్రినిడాడ్, టొబాగో.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్