యూఏఈలో దుబాయ్ చాక్లెట్ సేఫ్..!!
- July 26, 2025
యూఏఈ: అత్యంత ప్రజాదరణ పొందిన దుబాయ్ చాక్లెట్ ఉత్పత్తులు యూఏఈలో సేఫ్ అని అధికారులు ధృవీకరించారు.వాటిల్లో సాల్మొనెల్లా బాక్టిరియా లేదని స్పష్టం చేసింది. అంతకుముందు వాటి భద్రతపై US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించిందని అధికారులు తెలిపారు.
యూఏఈ వెలుపల ఉత్పత్తి చేయబడి స్థానిక మార్కెట్లలో అందుబాటులో లేని ఎమెక్ బ్రాండ్ ద్వారా స్ప్రెడ్ పిస్టాచియో కాకావో క్రీమ్ విత్ కడాయెఫ్ అనే ఉత్పత్తిని దుబాయ్ చాక్లెట్ రుచుల నుండి ప్రేరణ పొందిన చాక్లెట్గా ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ మార్కెట్లలో వివిధ రూపాల్లో లభించే ప్రసిద్ధ దుబాయ్ చాక్లెట్ సాల్మొనెల్లా లేదు. ఈ ఉత్పత్తి అమెరికన్ మార్కెట్లకే పరిమితం అని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ప్రకటన వెలుగులో రావడంతో ఈ స్పష్టత వచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారు. "ఈ ఉత్పత్తి 'దుబాయ్ చాక్లెట్' ఉత్పత్తులలో ఒకటిగా ప్రచారం అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ ఉత్పత్తి, 'దుబాయ్ చాక్లెట్' నుండి ప్రేరణ పొందిందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







