ఒమన్ ఎయిర్ పోర్టుల్లో పెరిగిన ప్రయాణీకుల రద్దీ..!!
- July 27, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్టుల్లో జూన్ నెలకు సంబంధించి ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,109,745 మంది ప్రయాణికులతో పోలిస్తే గత నెల 1,134,924 కు చేరుకుంది. ఏడాది పొడవునా ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని జరుగుతున్న కార్యక్రమాల కారణంగా ఈ వృద్ధీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు సహాయపడే తాజా టెక్నాలజీలు, స్మార్ట్ సేవలను అమలు చేయడం ద్వారా ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సజావుగా, సురక్షితంగా, అధిక-నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ధోఫర్ గవర్నరేట్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో ఎయిర్ పోర్టల్లో రద్దీ నెలకొన్నదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!